మాచారెడ్డి, మే 15 : మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న లక్ష్మీనృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ఆదివారం శతఘటాభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మూలవిరాట్‌కు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కస్తూరి నరహరి, ఈవో వెంకటనారాయణ, ఆలయ సిబ్బంది సంతోష్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
నేడు స్వామివారి కల్యాణం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఈవో వెంకటనారాయణ తెలిపారు. సాయంత్రం రథోత్సవం, భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని వివరించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.