ఆర్మూర్/ కమ్మర్పల్లి / జక్రాన్‌పల్లి, మే 12 : భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటూ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై వివిధ సంఘాలు ఆగ్ర హం వ్యక్తం చేశాయి. జిల్లాలోని పలుచోట్ల అర్వింద్ దిష్టిబొమ్మలను శనివారం దహనం చేసి నిరసన తెలిపాయి. భారత రాజ్యాంగం మారుస్తామన్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై రాజద్రోహం కేసు పెట్టాలని దళిత సంఘాల నాయకుడు, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న, ఆలిండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు మూగ ప్రభాకర్ డిమాండ్ చేశా రు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేసి నడిరోడ్డుపై ముట్టుడు స్నా నాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడు తూ అధికార, అంగబలంతో ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలను ప్రతిఒక్కరూ ఖండించాలన్నారు. కార్యక్రమంలో దళిత, గిరిజన సంఘాల నాయకులు గడ్డం శంకర్, చంద్రనాయక్, నల్లన్న, శెట్పల్లి నారాయణ, పొన్నాల రాజన్న, మోచి సాయిరాం, స్టాలిన్, ఇందారపు రాజు పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో దళిత, బహుజన సంఘాల నాయకులు ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. దళిత, బహుజనుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలు ఉన్నాయని, భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత, బహుజన సంఘాల నాయకులు సతీశ్, లక్ష్మణ్, అనంత్, విజయ్, వెంగళరావు, నిఖిల్, అర్జున్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చే అధికారం తమకు ఉన్నదని వ్యాఖ్యానించి అంబేద్కర్‌ను అవమానించారని నిరసిస్తూ శనివారం సాయంత్రం కమ్మర్‌పల్లిలో అంబేద్కర్ యువజన సంఘం, బీఎస్పీ ఆధ్వర్యంలో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి బెనర్జీ, ఏవైఎస్ మండల గౌరవ అధ్యక్షుడు పాలెపు నర్సయ్య, మండల అధ్యక్షుడు సుంకరి విజయ్, కన్వీనర్ తెడ్డు రమేశ్, బీఎస్పీ మండల అధ్యక్షుడు రాజీవ్ దాస్, నాయకులు క్రాంతి, బొర్రయ్య, అజయ్ పాల్గొన్నారు.