ఖలీల్‌వాడి, మే 10 : జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి సిటీ బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవా రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9.30 గంటలకు బస్సులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నగరంలోని డెయిరీ ఫారం నుంచి నిజాంప్యాలెస్, అర్సపల్లి, మాలపల్లి, చార్‌బాయి పెట్రోల్‌పంప్, నిజామాబాద్ టౌన్ ఓల్డ్ బస్టాండ్, గాంధీచౌక్, దేవిరోడ్డు, రైల్వేస్టేషన్, కలెక్టర్ చౌరస్తా, తిరుమల టాకీస్, దేవీ టాకీస్ ఎక్స్‌రోడ్డు, పూలాంగ్, త్రిమూర్తి, రాజీవ్‌గాంధీ విగ్రహం, ఆర్యనగర్, బోర్గాం మీదుగా మాధవనగర్ వరకు, 300 క్వార్టర్ల నుంచి నా గారం ఐవోసీ, ఇం ద్రాపూర్, రేణుకానగర్, వర్ని ఎక్స్‌రోడ్డు, ఆర్ఆర్ చౌ రస్తా, నెహ్రూ పా ర్కు, గాంధీచౌక్, దేవిరోడ్డు, బస్టాండ్, రైల్వేబ్రిడ్జి, దుబ్బరోడ్డు, నిర్మల హృద య హైస్కూల్, ఎస్ఎఫ్ఎస్ స్కూల్, రైతుబజార్ దుబ్బ మీదుగా నూతన కలెక్టరేట్ వరకు సిటీ బస్సులు తిరుగుతాయని వివరించారు. సిటీ బస్సుల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మేయర్ నీతూకిరణ్, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఉషాదేవి తెలిపారు. సిటీ బస్సులను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.