ఖలీల్వాడి, మే 6 : నిజామాబాద్ కలెక్టరేట్లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పోలీసులు బాధితుడిని అడ్డుకుని వివరాలు తెలుసుకున్నారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన మేకల చిన్నయ్యకు 2001లో అప్పటి ప్రభుత్వం మూడు ఎకరాల భూమిని కేటాయించింది. కాగా చిన్నయ్య భూమి పక్కన బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, డాక్టర్ మధుశేఖర్ భూములు సైతం ఉన్నాయి. తన భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని చిన్న య్య వాపోయాడు. ఈ విషయమై ఎనిమిది నెలలుగా ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా సీపీకి రిఫర్ చేశారని తెలిపాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్ ఎదుట సోమవారం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయమై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.