నిజామాబాద్ క్రైం, మే 9 : కోర్టు డ్యూటీ సిబ్బంది సకాలంలో చార్జిషీట్‌ను కోర్టులో సమర్పించాలని గ్రేడ్-2 జడ్జి రాంరెడ్డి అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో కోర్టు డ్యూటీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లతోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సీపీ నాగరాజు జడ్జి రాండ్డి ఆధ్వర్యంలో సోమవారం సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సకాలంలో సాక్షులను కోర్టుకు తీసుకువచ్చి సాక్ష్యం చెప్పిస్తే నేరస్తుడికి శిక్ష పడే అవకాశం ఉంటుందని, సిబ్బంది ఎల్లప్పుడూ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌ను త్వరగా పూర్తి చేసి సంబంధిత కాగితాలను కోర్టుకు సమర్పించాలని సూచించారు. ఈ మధ్యకాలంలో జైలు శిక్ష ఖరారైన పలు కేసుల వివరాలను సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. అనంతరం నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని పలువురు సిబ్బందికి అప్రిషియేషన్ సర్టిఫికెట్లతోపాటు రివార్డులను అందజేసి అభినందించారు. సమావేశంలో అదనపు డీసీపీ డాక్టర్ వినిత్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పి.రవిరాజు, కవితారెడ్డి, వసంత్, రమేశ్, శ్రీనివాస్, ఏసీపీ రహీముద్దీన్, వీరయ్య, రాజేశ్, గోపి, రాణి, పోశెట్టి, రాజేశ్వరి, ఏసీపీలు వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌రావు, రామారావు, కరుణాసాగర్‌రెడ్డి, శ్రీహరి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.