బోధన్, మే 6: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రసూతి సహాయం.. ఇలా అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయని, ఇంత గొప్ప సంక్షేమ పథకాలు ఇతర ఏ రాష్ట్రంలో లేవని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గంలోని 176 మంది లబ్ధిదారులకు ఆయన కల్యాణలక్ష్మి చెక్కులను శుక్రవారం పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడబిడ్డల వివాహాలు పేద కుటుంబాలకు ఆర్థిక భారం కాకూడదన్న ఉద్దేశంలో సీఎం కేసీఆర్ పెండ్లికి లక్షా 16 వేల రూపాయలను ఇస్తున్నారన్నారు. దీంతో పేద కుటుంబాలు ఎంతో సంతోషంగా ఆడపిల్లల వివాహాలు చేయగలుగుతున్నాయని చెప్పారు. ప్రసవాలు ప్రభుత్వ దవాఖానలో జరిగితే.. ఒక్కో ప్రసవవానికి రూ.13 వేలు ఆర్థిక సహాయంతో పాటు కేసీఆర్ కిట్‌ను కూడా అందిస్తున్నారన్నారు. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటుచేసి ఒక్కో విద్యార్థినిపై ఏడాదికి లక్షా 25 వేల రూపాయలను ప్రభు త్వం ఖర్చుచేస్తోందన్నారు.
కార్యక్రమంలో బోధన్ ఎంపీపీ చైర్మన్ బుద్దె సావిత్రి, జడ్పీటీసీ లక్ష్మీ గంగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, రైతుబంధు సమితి మండల మాజీ సమన్వయకర్త బుద్దె రాజేశ్వర్, టీఆర్ఎస్ బోధన్ మండల అధ్యక్షుడు గోగినేని నర్సయ్య, ప్రధాన కార్యదర్శి సిర్ప సుదర్శన్, ఏఎంసీ వైస్ చైర్మన్ సాలూరా షకీల్, టీఆర్ఎస్ నాయకులు భవానీపేట్ శ్రీనివాస్, రుద్ర సత్యనారాయణ, బీర్కూర్ బుజ్జి, సంజీవ్‌కుమార్, వి.రామిరెడ్డి, రఫీయొద్దీన్, ధూళిపాల పౌల్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ బీమా చెక్కు అందజేత..
మండలంలోని హున్సా గ్రామానికి చెందిన టీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త బాలేవార్ నగేశ్ గత సంవత్సరం నవంబర్ నెలలో బైకుపై నుంచి పడి మరణించాడు. అతడికి పార్టీ నుంచి బీమా మంజూరు కాగా.. బోధన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షకీల్ రూ.రెండు లక్షల విలువైన చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బుద్దె సావిత్రీ రాజేశ్వర్, జడ్పీటీసీ గిర్దావర్ లక్ష్మి, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ బుద్దె రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సన్న, సిర్ప సుదర్శన్, ఏఎంసీ వైస్ చైర్మన్ సాలూరా షకీల్, ఎంపీటీసీ శివకుమార్, టీఆర్ఎస్ యూత్ నాయకుడు శ్రీనివాస్, సర్పంచులు నానాపటేల్, కొర్వ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.