డిచ్పల్లి, మే 6 : నేలతల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాంపూర్ గ్రామ శివారులోగల విశ్వ ఆగ్రోటెక్లో ఆర్గానిక్ బయో ఫర్టిలైజర్ యూనిట్‌ను రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో రైతులకు పంటలసాగు, శాస్త్రీయ సాగుపై త్వరలో ప్రభుత్వ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో ప్రతి జిల్లాలో రైతులకు వ్యవసాయంపై శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించారన్నారు. రైతులు సాధ్యమైనంత మేర సేంద్రియ ఎరువుల సాగుపై దృష్టిసారించాలని సూచించారు.
విశ్వ ఆగ్రోటెక్ ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిందని, రాబోయే రోజుల్లో శిక్షణకు మారుపేరు గా నిలవాలని యజమానులకు సూచించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ విశ్వ ఆగ్రోటెక్లో రైతులకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విశ్వ ఆగ్రోటెక్లో 150 మందికి ఉపాధి కల్పించి భవిష్యత్తులో వెయ్యి మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని సంస్థ నిర్వాహకుడు బైర సుభాష్ ప్రకటించడంపై మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే విశ్వఆగ్రోటెక్ నంబర్ వన్‌గా ఎదుగుతూ రైతులకు ఎల్లవేళలా బయోఫర్టిలైజర్ సరఫరా చేస్తూ రైతులకు ఆదాయం పెంచుతూ భూతల్లిని కాపాడే విధంగా శిక్షణ ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు.
ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు మాట్లాడారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పో చారం భాస్కర్‌రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్మోహన్, దాసరి ఇందిర, ఎంపీపీలు రమేశ్ నాయక్, నల్లసారికా హన్మంత్‌రెడ్డి, ఒలింపిక్ జిల్లా సంఘం అధ్యక్షుడు గడీల రాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సాయిలు,సర్పంచ్ తిరుపతి, ఎంపీటీసీ పోతర్ల సుజాతారవి, విశ్వఆగ్రోటెక్ ప్రతినిధులు బైర సుభాష్, లక్ష్మణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.