మోర్తాడ్, ఏప్రిల్ 30: సమానత్వం, సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హౌసింగ్, ఆర్అండ్బీ, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మోర్తాడ్‌లో శనివారం అధికారికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌కు మంత్రి హాజరై మాట్లాడారు. ముస్లిములు సామాజికంగా, ఆర్థికంగా వృద్ధిచెందాలని ప్రభుత్వం సంక్షేమపథకాలు అందిస్తున్నదని చెప్పారు. ముస్లిములకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పర్సదేవన్న, వైస్‌ఎంపీపీ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ పాపాయి పవన్, కో-ఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి సన్మానం..
మండలంలోని పడగల్, మోతె గ్రామాల్లో ఉన్న ముస్లిమ్ గ్రేవీ యార్డ్ కాంపౌండ్ వాళ్లకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి నిధులు మంజూరు చేయించారు. దీంతో వేల్పూర్‌లో ఆయా గ్రామాల్లోని ముస్లిములు మంత్రిని శనివారం సన్మానించారు. మోతె ఈద్గా ప్రహరీకి రూ.ఏడు లక్షలు, పడగల్లోని ఈద్గా శ్మశానవాటికకు రూ.ఎనిమిది లక్షల నిధులు మంజూరు చేయించారు.