రెంజల్, ఏప్రిల్ 28: మండలంలోని పేపర్‌మిల్ గ్రామంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్, బుద్ధుడి విగ్రహాలను గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారాం హాజరై విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. పేద, దళిత వర్గాలు బాగా చదువుకోవాలని సూచించారు. ఎంపీపీ రజిని, జడ్పీటీసీ విజయ, సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్ పాషా, వైస్ ఎంపీపీ యోగేశ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నక్క విజయ్‌కుమార్, జక్కుల సంతోష్, జిల్లా నాయకులు రాఘవేందర్, సంతోష్, ఫారూఖ్ఖాన్, శ్రీకాంత్, రమేశ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
కందకుర్తిలో అంబేద్కర్ జయంతి..
మండలంలోని కందకుర్తి గ్రామంలో అంబేద్కర్ జయంతిని బుధవారం రాత్రి నిర్వహించారు. సర్పంచ్ ఖలీంబేగ్, వక్త శంకర్ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. భక్తి పాటలపై నృత్యాలు చేస్తూ గ్రామంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ సాగింది. కందారే గంగాధర్, రాము, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.