బాల్కొండ/భీమ్‌గల్/నవీపేట/కమ్మర్పల్లి, ఏప్రిల్ 25: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జోరుగా ఏర్పాటుచేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్లు చేపడుతున్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్‌నగర్, వన్నెల్(బీ), బోదేపల్లి గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, వైస్‌చైర్మన్ వేంపల్లి చిన్నబాల్రాజేశ్వర్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి సోమవారం ప్రారంభించారు. తహసీల్దార్ వినోద్, ఏవో మమేందర్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండలంలోని బినోలా సొసైటీ పరిధిలో ఉన్న నిజాంపూర్, కమలాపూర్, బినోలా, అనంతగిరి ఆశాజ్యోతి కాలనీలో ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సొసైటీ వైస్ చైర్మన్ బాబర్, సీఈవో రమేశ్, సర్పంచులు పీతంబర్, రవీందర్‌రెడ్డి, గద్దం బబు, రమేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్, కోనాసముందర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ రూపా రాజు, వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్, ఉపసర్పంచ్ లింబాద్రి, డైరెక్టర్లు పాల్గొన్నారు. భీమ్‌గల్ మండలంలోని బెజ్జోరా, చేంగల్, బాబానగర్, సిక్రింద్రాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను విండో చైర్మన్ శివసారి నర్సయ్య, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి ప్రారంభించారు. భీమ్‌గల్‌లో కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతతో కలిసి సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.