ఖలీల్‌వాడి, ఏప్రిల్ 19: నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా చేస్తున్న అభివృద్ధి పనులు బీజేపీ నాయకులకు కనబడడంలేదా అంటూ టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. నగరంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేయగా, దీనిపై టీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇచ్చారు. సుందరనగరంగా ఇందూరు ముస్తాబైతే బీజేపీ నాయకులు, స్రవంతిరెడ్డి కండ్లకు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. ఆమె స్వయంగా వస్తే తాము వీధుల్లో తిప్పుకుంటూ చూపిస్తామని సవాల్ విసిరారు. స్రవంతిరెడ్డి వ్యాఖ్యలపై సోషల్‌మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చి, ఇందుకు సంబంధించిన వీడియోలను ఫేస్బుక్, ట్విట్టర్‌తోపాటు ఎంపీ అర్వింద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ట్యాగ్ చేశారు.
బిగాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు
మా నాయకులని కొడుతారా.. ముందు ఏమీ చేయని మీ నాయకులను తరిమికొట్టకుండా చూసుకోండి. ఇందూరును సుందరంగా తీర్చిదిద్దినది ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అని అందరూ అంటుంటే ఏసీ గదుల్లో కూర్చొని పిచ్చికూతలు కూస్తున్నావా. ఎండలో రోడ్లపైకి వచ్చి చూడు తెలుస్తది. ఎమ్మెల్యే బిగాల చేసిన అభివృద్ధి పనుల వివరాలు తీసుకొస్తా.. మీ నాయకుడు రాసిచ్చిన బాండ్ పేపర్ తీసుకొని నువ్వురా తేల్చుకుందాం.
-మంజుల యాదవ్, టీఆర్ఎస్ నాయకురాలు
అభివృద్ధిని కండ్లతో చూసి మాట్లాడాలి
అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అభివృద్ధి చేసినట్లు ఇప్పటివరకూ ఎవ రూ చేయలేదు. స్రవంతి రెడ్డి ఖబడ్దార్. ఇంకోసారి విమర్శిస్తే సహించేదిలేదు. ఇంట్లో ఏసీలో కూర్చొని మాట్లాడడం కాదు.. స్వయంగా నగరంలో జరిగిన అభివృద్ధిని కండ్లతో చూసి మాట్లాడాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఏ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. ఏమీ చేయలేని మీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను అడగండి.
-చంద్రకళ, టీఆర్ఎస్ కో-ఆప్షన్ సభ్యురాలు
ఢిల్లీ కార్పొరేటరా.. గల్లీ కార్పొరేటరా!
స్రవంతి రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కా దు. గల్లీ కార్పొరేటరువా.. లేదా ఢిల్లీ కార్పొరేటరువా.. ముందు గల్లీలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకొని మాట్లాడాలి. నగరం ఎంత అభివృద్ధి చెందిందో తెలియని నువ్వు మాట్లాడుతున్నావా.. నీకు అర్బన్ డెవలప్మెంట్ గురించి తెలియదు. రోడ్లు, పార్కులు చూసి తెలుసుకో.. కండ్లతో చూసి మాట్లాడాలి.