ధర్పల్లి/నిజామాబాద్ రూరల్/ మోపాల్(ఖలీల్‌వాడి)/ రుద్రూర్/ చందూర్/ భీమ్‌గల్/ ఏర్గట్ల/ రెంజల్/ శక్కర్‌నగర్, ఏప్రిల్ 19 : జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను జోరుగా ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ధర్పల్లి మండలంలోని ప్రాజెక్టు రామడుగు, మైలారం, కేశారం, సల్లగరిగె గ్రామాల్లో సహకార సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ నల్ల సారికాహన్మంత్రెడ్డితో కలిసి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ప్రారంభించారు. ప్రాజెక్టు రామడుగులో పలు బాధిత కుటుంబాలను జగన్ పరామర్శించారు.
నిజామాబాద్ రూరల్ మండలం పాల్దలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ చైర్మన్ శ్రీనివాస్‌తో కలిసి సొసైటీ చైర్మన్ జితేందర్ ప్రారంభించారు. మోపాల్ మండలం మంచిప్పలో సర్పంచ్ సిద్ధార్థ, రుద్రూర్ మండలం చిక్కడ్‌పల్లిలో విండో చైర్మన్ సంగమేశ్వర్, సర్పంచ్ పుష్పలతారమేశ్, చందూర్ మండలం మేడ్పల్లిలో సొసైటీ చైర్మన్ మాధవరెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీల డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
భీమ్‌గల్ మండలంలోని మెండోరా గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ మహేశ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శర్మనాయక్ ప్రారంభించారు.
ఏర్గట్ల, బట్టాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ వైస్ చైర్మన్ కె.రమేశ్‌రెడ్డి, ఎంపీపీ కొలిప్యాక ఉపరేందర్రెడ్డి, ఏర్గట్ల సొసైటీ చైర్మన్ బర్మ చిన్ననర్సయ్య పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
రెంజల్ మండలంలోని సాటాపూర్‌లో రెంజల్ విండో ఆధ్వర్యంలో, నీలా గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్ పాషా, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు గౌరాజీ రాఘవేందర్ ప్రారంభించారు.ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ శ్రీనివాస్, జాన్కంపేట్ సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ ప్రారంభించారు.