విద్యానగర్, ఏప్రిల్ 12 : పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంగళవారం కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు నిర్వహించే సమయం లో లైన్ డిపార్ట్మెంట్ సహకరించాలని సూచించారు. ముఖ్యం గా రెవెన్యూ, పోలీసు, ఆర్టీసీ, పోస్టల్, హెల్త్ డిపార్ట్మెంట్ పరీక్ష సజావుగా జరగడానికి సహకరించాలని కోరారు. డీఈవో రాజు మాట్లాడుతూ.. జిల్లాలో పదోతరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలి పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 69 సెంటర్లలో 291 పాఠశాలల నుంచి మొత్తం 12,448 మంది పరీక్ష రాస్తారన్నారు. ఇందులో 6,236 మంది బాలికలు, 6,212 బాలురు ఉన్నార ని అన్నారు. 69 చీఫ్ సూపరింటెండెంట్లు, 69 డిపార్ట్మెంటల్ ఆఫీసర్ నియమించిన ట్లు తెలిపారు. ఆరుగురు రూట్ ఆఫీసర్లను, 690 ఇన్విజిలెటర్లను నియమించి నట్లు చె ప్పారు. కార్యక్రమంలో ఆయా డిపార్ట్మెం ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆయుష్ భవన నిర్మాణ పనుల పరిశీలన
మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో నిర్మిస్తున్న ఆయుష్ యోగ భవన నిర్మాణ పనులను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవనాన్ని త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని వైద్యాధికారికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ గోవర్ధన్, ఎంపీడీవో సతీశ్, వైద్యుడు హరికృష్ణ తదితరులు ఉన్నారు.