నిజామాబాద్ లీగల్, మార్చి 30: ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్‌ను రాజీ పద్ధతిన ఒప్పించి రైతులకు దాదాపు రూ.70లక్షల లబ్ధి చేకూర్చామని ఉమ్మడి జిల్లా జడ్జి సునీత తెలిపారు. ఈ మేరకు బిచ్కుంద మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణలో ఉన్న 43 సివిల్ దావాలను పరిష్కరించామని చెప్పారు. జాతీయ లోక్‌అదాలత్‌లో ప్రముఖ పాత్ర వహించిన వారికి అదనపు జిల్లా జడ్జిలు గౌతంప్రసాద్, పంచాక్షరి, సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్‌తో కలిసి న్యాయ సేవాసదన్‌లో బుధవారం ప్రశంసాపత్రాలను అందజేశారు. ప్రధాన భూమికను నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జిలు, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జిలు కళార్చన, సౌందర్య, భవ్య, సీనియర్ సివిల్ జడ్జి కిరణ్మహి, సేవాసంస్థ న్యాయవాదులు రాజ్‌కుమార్ సుబేదార్, జగన్మోహన్గౌడ్, మాణిక్‌రాజ్, ఆశా నారాయణ, పిల్లి శ్రీకాంత్, పర్యవేక్షకులు పురుశోత్తంగౌడ్, చంద్రసేన్‌రెడ్డి పాల్గొన్నారు.