రుద్రూర్, ఫిబ్రవరి 9 : నూనె గింజల సాగుపై దృష్టి సారించాలని రైతులకు ఏడీఆర్ సంచాలకురాలు ఉమాదేవి రైతులకు సూచించారు. యాసంగి సీజన్లో వరికి బదులు ఇతర పంటల సాగుపై రుద్రూర్‌లోని కేవీకేలో రైతులకు బుధవారం ఆమె అవగాహన కల్పించారు. ఇతర పంటల సాగుపై రైతులకు ఎప్పటిక ప్పుడు శాస్త్రవేత్తలు, అధికారులు సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ మాట్లాడుతూ.. జిల్లాలో వరిసాగు విస్తీర్ణం 3లక్షల 77వేల ఎకరాల నుంచి 3లక్షల మూడువేల ఎకరాలకు తగ్గిందన్నారు. జొన్న సాగు 5వేల నుంచి 12వేల ఎకరాలకు, సజ్జ16 వేల నుంచి 20వేలకు, వేరుశనగ 450 నుంచి 1700 ఎకరాలకు పెరిగింద న్నారు. ఈ విజయం, మార్పు వెనుక అధికారుల కష్టం, రైతుల సహకారం ఉందన్నారు. పంటల సాగుపై రైతులకు శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసా య అధికారులు అందుబాటులో ఉంటూ తమకు పంటల సాగుపై అవగాహన కల్పించాలని కారేగాం గ్రామానికి చెందిన రైతు లక్ష్మ ణ్ కోరారు. కామారెడ్డి జిల్లా వ్యవసాయాధికారిణి భాగ్యలక్ష్మి, బ్యాంకు అధికారులు నరేందర్, భీమేశ్, వెంకట రమణ, రుక్మిణి, బాలాజీనాయక్, కో-ఆర్డినేటర్ నవీన్‌కుమార్, నరేంద్రకుమార్, నగేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.