వేల్పూర్, అక్టోబర్ 17: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని 25 మంది బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.