కోటగిరి/ రుద్రూర్(వర్ని)/ ఆగస్టు 1 : కోటగిరి మండలకేంద్రానికి చెందిన ఎనిమిది మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కులను బాధితులకు బాన్సువాడ పట్టణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం అందజేశారు. కాయపల్లి శ్రీనివాస్‌కు రూ. 60 వేలు, వి.సుజాతకు రూ.24 వేలు, ఏముల చిన్న నర్సయ్యకు రూ.60 వేలు, పి.లాలయ్యకు రూ.20 వేలు, కల్లూర్‌కు చెందిన సీహెచ్. రాజారెడ్డికి రూ. 60 వేలు, కె. సాయిలుకు రూ.40 వేలు, సుద్దులం చిన్న బాబన్నకు రూ.60 వేలు, ఎత్తొండకు చెందిన ఎం.సాయిలుకు రూ.22 వేల 500 మంజూరైనట్లు వివరించారు.
కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, కోటగిరి విండో చైర్మన్ కూచి సిద్ధు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ చాకూరే గంగాధర్, తేళ్ల అరవింద్, అనిల్, వోలే లింగప్ప, వెంకట్‌రెడ్డి, నాగరాజుగౌడ్, హౌగీరావుపటేల్ పాల్గొన్నారు. వర్ని మండలానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు సైతం స్పీకర్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు హరిదాస్, ఏఎంసీ వైస్‌చైర్మన్ వెలగపూడి గోపాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గిరి, సీనియర్ నాయకుడు వీర్రాజు, సర్పంచులు పాల్గొన్నారు.
డిచ్పల్లి, ఆగస్టు 1 : సిరికొండ మండలకేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా.. ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్ ఆయన స్వగృహంలో సోమవారం అందజేశారు. కందుల అరుణ్‌సాగర్‌కు 16 వేలు, కందుల చిన్నయ్య (కేశ్‌పల్లి)కి రూ. 48 వేలు, బి.మల్లయ్య (కేశ్‌పల్లి)కు రూ.17 వేలు, ఓ. పోసాని (బాల్నగర్)కి రూ. 9 వేలు, కె.పోసాని (బాల్నగర్)కి రూ.29 వేలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కుంచాల విమలారాజు, సర్పంచ్ మైదాన్ మహేశ్వర్, ఎంపీటీసీ జయగిరి, మాజీ ఎంపీపీ మైదం రాజన్న తదితరులు పాల్గొన్నారు.
మోస్రా (చందూర్), ఆగస్టు 1 : మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 37 మంది లబ్ధిదారులు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించుకున్నారు. వారికి రూ. 70 వేల చొప్పున మంజూరైన చెక్కులను జడ్పీటీసీ సభ్యుడు గుత్ప భాస్కర్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఏఈ నాగేశ్వర్రావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పిట్ల శ్రీ రాములు, సర్పంచ్ సున్నం భూమయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరలు పాల్గొన్నారు.