నిజామాబాద్ క్రైం, ఆగస్టు1: జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం చెడ్డిగ్యాంగ్ ముఠా కదలిలను స్థానికులు గుర్తించారు. ఒంటి పై చిన్నపాటి గుడ్డతో ముఖానికి ముసుగు ధరించి, చేతిలో మారణాయుధాలు పట్టుకొని అర్ధరాత్రి సమయంలో నిర్మానుషంగా ఉన్న కాలనీలను ఎంచుకొని దోపిడీలకు పాల్పడడం ఈ ముఠా సభ్యులకు వెన్నతో పెట్టిన విద్య. వీరు దోపిడీలకు వచ్చిన సమయంలో ఎవరైనా అడ్డుపడితే మారణాయుధాలతో వారి ప్రాణాలను సైతం తీయడంలో ఈ గ్యాంగ్ వెనుకాడదు.
గతంలో చాలా సార్లు నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడడంతోపాటు దాడులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. ఈ కురుడుగట్టిన ముఠా సభ్యులు ఆదివారం తెల్లవారు జామున నగరంలోని కంఠేశ్వర్ ఏరియాలో ఆయుధాలు పట్టుకొని దోపిడీకి వచ్చిన దృశ్యలు కాలనీలోని ఓ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలకు చిక్కాయి.
అదే సమయంలో కాలనీ వాసులు మేల్కొని గట్టిగా అరవడంతో వారు అక్కడి నుంచి ఫరారైన్నట్లు కాలనీ వాసులు తెలిపారు. అర్ధరాత్రి అనంతరం పోలీస్ పెట్రోలింగ్ లేకపోవడంతో ఈ చెడ్డీ గ్యాంగ్ మళ్లీ దోపిడీలకు వస్తోందని కాలనీ వాసులు వాపోతున్నాయి. తెల్లవార్లు పెట్రోలింగ్, పోలీస్ మూమెంట్ ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అంటున్నారు.