తాడ్వాయి, జూలై 27 : మండల పరిధిలోని సం తాయిపేట భీమేశ్వరవాగు బుధవారం సాయం త్రం ఒక్కసారిగా పొంగిపొర్లింది. దీంతో కూలీలు వాగు దాటలేక అక్కడే చిక్కుకుపోయారు. గ్రామానికి చెందిన రైతుల వ్యవసాయ భూములు భీమేశ్వరవాగుకు అవతల వైపు ఉంటాయి. వాగు అవతల దాదాపు 300పైగా ఎకరాల్లో వరి, మక్కజొన్న పంటలను రైతులు సాగు చేస్తున్నారు. రోజు మాదిరిగానే బుధవారం తమ వ్యవసాయ పొలాల్లో పనులు చేయడానికి రైతులు, కూలీలు దాదా పు 150 మంది వెళ్లారు.
మధ్యాహ్నం భీమేశ్వరవాగు ఎగువప్రాంతమైన కన్కల్, దేమికలాన్, ఎర్రాపహాడ్ గ్రామ శివారులో భారీ వర్షం కురిసింది. భీమేశ్వరాలయం చుట్టుపక్కల తేలికపాటి వర్షం పడడంతో రైతులు వాగు దాటవచ్చని అనుకుని అక్కడకు చేరుకున్నారు. వాగు ఉధృతంగా పారడంతో రైతులు, కూలీలు అవతలి వైపు చిక్కుకున్నారు. విషయాన్ని గ్రామంలో ఉన్నవారికి, రెవెన్యూ అధికారులకు, పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
అధికారులు వాగు దగ్గరికి చేరుకుని కూలీలను దాటించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. వాగులో ఉధృతి తగ్గకపోవడంతో రాత్రి 8 గంటల సమయంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఎస్సై ఆంజనేయులు, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి గ్రామస్తుల సహకారంతో జేసీబీని తీసుకువచ్చి కూలీలను సురక్షితంగా వా గును దాటించారు. గత సంవత్సరం ఇదే విధంగా వాగు పొంగిపొర్లడంతో జేసీబీలోనే కూలీలను ఇవతల ఒడ్డుకు దాటించారు.
రైతులు,కూలీలు భీమేశ్వర వాగులో చిక్కుకున్న విషయాన్ని మీడియాలో చూసిన మంత్రి వేము ల ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. అధికారులతో ఫోన్ మాట్లాడి విషయం తెలుసుకున్నారు. అవతలి వైపు చిక్కుకున్న వారికి భోజన సౌకర్యం క ల్పించాలని ఆదేశించారు.
కలెక్టర్ జితేశ్ వీ పాటి ల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారిని రక్షించేందుకు అ న్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాడ్వా యి సర్పంచ్, ఎస్సై ఆంజనేయులతో మంత్రి ఫో న్ మాట్లాడారు. పోలీసులు తక్షణమే స్పందించ డంతో మంత్రి వారిని అభినందించారు.