డిచ్పల్లి, జూలై 27 : అల్ట్రాసోనిక్స్ అండ్ మెటీరియల్, సైన్స్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీపై తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆగస్టు ఒకటి నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ సైన్స్ కాన్ఫరెన్స్‌ను విజయవంతం చేయాలని వీసీ రవీందర్ కోరారు. టీయూ అనుబంధ కళాశాలల యాజమాన్యంతో బుధవారం సమావేశం నిర్వహించారు.
కాన్ఫరెన్స్‌లో చర్చించనున్న విషయాలు, దేశ, దేశాల నుంచి హాజరవుతున్న ప్రముఖుల వివరాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం పూర్తి సహాయ సహకాలు అందించాలని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత గుర్తింపును సంతరించుకోబోతున్న కాన్ఫరెన్స్‌కు సైన్స్ రంగాలకు శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు పాల్గొనాలని కోరారు. అనంతరం కాన్ఫరెన్స్ బ్రోచర్లను ప్రిన్సిపాళ్లకు అందించారు.
యూనివర్సిటీ ప్రిన్సిపాల్స్, సైన్స్ డీన్, సైన్స్ విభాగ అధ్యాపకులు, వివిధ కమిటీల సభ్యులతో వీసీ రవీందర్ సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఆయా కమిటీల సభ్యు లు పూర్తి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ప్రిన్సిపాల్ ఆరతి, సారంగపూర్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మహేందర్‌రెడ్డి, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ అరుణ తదితరులతో కలిసి బ్రోచర్లను ఆవిష్కరించారు.
అల్ట్రాసోనిక్స్ అండ్ మెటీరియల్, సైన్స్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీపై నిర్వహించనున్న ఇంటర్నేషల్ కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని పలువరు ప్రముఖులను వీసీ రవీందర్ కోరారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ను కలిసి ఆహ్వానించారు.