ఖలీల్‌వాడి, జూలై 24: నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరగా..తాజాగా సీనియర్ నాయకుడు, 23వ డివిజన్ కార్పొరేటర్ మల్లేశ్ యాదవ్ చేరారు. సోమవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు ఎమ్మెల్సీ కవిత గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లేశ్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడినై టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. మల్లేశ్ యాదవ్ 35 ఏండ్లుగా బీజేపీలో ఉండి మూడు సార్లు కార్పొరేటర్‌గా పని చేశారు. వార్డు మెంబర్‌గా రాజకీ య ప్రస్థానం మొదలు పెట్టారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఏర్పా టు చేసిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్‌రావు పాల్గొన్నారు.