శక్కర్‌నగర్, ఆగస్టు 13 : బోధన్ పట్టణంలోని న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో సుమారు వందకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. న్యాయస్థానంలోని నాలుగు బెంచీల్లో కేసులను విచారించారు. మొద టి బెంచ్‌లో ఐదో అదనపు న్యా యమూర్తి ఎస్.రవికుమార్, న్యాయవాది మధుసింగ్, రెండో బెంచీలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి శివరామప్రసాద్, న్యాయవాది మారుతీరావు ఖన్నా, మూడో బెంచీలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గౌస్‌పాషా, న్యాయవాది సీహెచ్‌వీ.హన్మంత్‌రావు, నాలుగోబెంచీలో అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎం.అపర్ణ, న్యాయవాది జి. కళ్యాణి కేసులను పరిశీలించారు. లీగల్‌సెల్ ప్రతినిధులు, బ్యాంక్ మేనేజర్లు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.