మాక్లూర్, ఆర్మూర్ : పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే పోలింగ్‌కు (Polling) పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాదాపూర్ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల, టీచర్స్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ( Collector ) రాజీవ్ గాంధీ హన్మంత్ ( Rajiv Gandhi Hanmanth ) సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆర్మూర్ పట్టణంలో..
ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పోలీంగ్ కేంద్రాన్ని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఓటర్లను తనిఖీ చేసిన తరువాత వారి వద్ద గుర్తింపు కార్డులుంటేనే కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఎన్నికలను పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని ఆర్డీవో రాజాగౌడ్ తెలిపారు.