శక్కర్ నగర్(బోధన్) : బోధన్ మున్సిపల్ పరిధిలోని నర్సాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయం ప్రారంభోత్సవం రావాల్సిందిగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని శుక్రవారం నిజామాబాద్లో గ్రామస్థులు ఆహ్వానించారు. ఆయనను కలిసిన వారిలో కే ప్రవీణ్, శంకర్, బి. ప్రవీణ్, కనకయ్య తదితరులు ఉన్నారు.
బోధన్ రూరల్ : సాలూర మండలంలోని సాలంపాడ్ క్యాంపు గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ముగ్గురిని పట్టుకుని అరెస్ట్ చేసినట్టు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు. పేకాట ఆడుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు బోధన్ రూరల్ ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ముగ్గురు పట్టుకొని వారి వద్ద నుండి రూ. 12000 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఎస్ఐ వెల్లడించారు.
పెద్ద కొడప్ గల్: మండల కేంద్రంలో నమూనా డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం పనులను శుక్రవారం ఎంపీడీవో లక్ష్మి కాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈయన వెంట కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
బాన్సువాడ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కు నిరసిస్తూ హైదరాబాదులో ప్రజాసంఘాలు తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా ఏఐసీటీయూ నాయకులు జె రవీందర్ పిలుపునిచ్చారు. బాన్సువాడ ఆర్ అండ్ బి అతిథి గృహంలో స్థానిక కార్మిక నాయకులతో కలిసి ఆయన కార్మిక సంఘాల అందరూ ఈ మహా ధర్నా లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.