e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home జిల్లాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి
వీడియోకాల్‌ద్వారా సమీక్ష

ఆర్మూర్‌, మే 9: నియోజకవర్గంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి ఆయన నియోజకవర్గంలోని విండో చైర్మన్లు, సర్పంచులతో ఆదివారం వీడి యో కాల్‌లో మాట్లాడారు. ధా న్యం కొనుగోళ్లు ఎలా సాగుతున్నాయి..? ఇబ్బందులు ఏమై నా ఉన్నాయా అని ఆరా తీశా రు. లారీలు, హమాలీల కొరత ఉన్నదని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌తో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలను పరిష్కరించాలని వారిని కోరారు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలను పాటించాలని సొసైటీల చైర్మన్లకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం సర్పంచులతో మాట్లాడుతూ.. గ్రామా ల్లో కొనసాగుతున్న జ్వర సర్వే వివరాలను తెలుసుకున్నారు. గ్రామాలకు వచ్చే సర్వే బృందాలకు గ్రామస్తులు సహకరించేలా చూడాలని సర్పంచులతో పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు హోం ఐసొలేషన్‌లో ఉంటూ వైద్యసిబ్బంది అందించే మందులను వాడాలని సూచించారు. ఎమ్మెల్యేతో వీడియోకాల్‌లో మాట్లాడిన వారిలో మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి, సొసైటీల చైర్మన్లు సోమ హేమంత్‌రెడ్డి, కల్లె భోజారెడ్డి, కాపెల్లి చిన్న ముత్తెన్న, గడ్డం శ్రావణ్‌రెడ్డి, సర్పంచులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ట్రెండింగ్‌

Advertisement