నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తొమ్మిది గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తారు. గోదావరి నుంచి 1,51,000 క్యూసెక్కుల వరద వస్తుండడంతో దిగువకు 9 గేట్ల నుంచి 25 వేల క్యూసెక్కులను విడిచిపెట్టారు. వరద కాలువ ద్వారా 3000 క్యూసెక్కులు పంపుతున్నారు. దిగువ గోదావరిలో వరద పోటెత్తడంతో చుట్టుపక్కల ప్రజలను ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.