మండలంలోని కందకుర్తి గ్రామసమీపంలో గోదావరి, హరిద్రా, మంజీరానదులు కలిసే త్రివేణి సంగమ క్షేత్రం జలకళను సంతరించుకుంది. ప్రతి ఏడాది ఏరువాక పౌర్ణమి రోజున నదిలోకి కొత్త నీరు వచ్చి చేరడం అనవాయితీగా వస్తోంది.
దీంతో శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలతో నదీ పరీవాహక ప్రాంతం శివనామ స్మరణతో మార్మోగింది. నదిలోని పురాతన శివాలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు.
-రెంజల్, జూన్ 21