నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 9 : మత్తు పదార్థా ల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చా రు. మత్తుపదార్థాలను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. గంజా యి, మత్తు పదార్థాల నియంత్రణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గంజాయి సాగు చేసేవారికి సంక్షేమ పథకాలు వర్తింపజేయవద్దని బహిరంగంగా ప్రకటించడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తున్నదన్నారు. మత్తు పదార్థాల నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆయన పిలువునిచ్చారు. సత్ప్రవర్తన కలిగిన పౌరులతో కూడిన సమాజం సత్వర ప్రగతిని సాధిస్తుందన్నారు. దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మత్తురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముందుకు సాగుతున్నదన్నారు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారు చెడు మార్గాల్లోకి వెళ్తారనేందుకు ఇటీవల డిచ్పల్లి మండలంలో జరిగిన ట్రిపుల్ మర్డర్ ఘటనే నిదర్శమని పేర్కొన్నారు. గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములై ముందుకు వెళ్తే వందశాతం ఫలితాన్ని సాధించవచ్చన్నారు.
సమాజానికి చేటు చేస్తున్న మత్తు పదార్థాలను విక్రయించే స్మగ్లర్లు ఎంతటివారైన ఉపేక్షించబోమని సీపీ నాగరాజు హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. యువత, విద్యార్థులు మత్తుకు బానిసలుగా మారుతున్నారని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనరేట్ పరిధిలో మత్తుపదార్థాల నియంత్రణ కోసం తమ శాఖ సిబ్బంది కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గంజాయి సాగు, రవాణా చేసేవారి వివరాలను అందించే వారికి పారితోషికం అందజేస్తామని వెల్లడించారు. మత్తు పదార్థాల నియంత్రణ ఉద్యమం లో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులను భాగస్వాములను చేస్తూ ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సదస్సులో మేయర్ నీతూకిరణ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్చం ద్ర, డీఎఫ్వో సునీల్ హీరామత్, డీటీసీ వెంకటరమణ, డిప్యూటీ మేయర్ ఇద్రిస్, స్థానిక సంస్థల అ దనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఎక్సైజ్, పోలీసు అధికారులు మాట్లాడారు. మత్తుపదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్పోస్టర్లను అధికారులు ఆవిష్కరించారు. అనంతరం మత్తుపదార్థాల నియంత్రణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.