బాన్సువాడ : కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) నిరుద్యోగులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్భాలు పలికి నిరుద్యోగ యువతకు మోసం చేశారని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు (Kasula Balaraj ) , బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి కైలాస నేత ( Kailas Neta) విమర్శించారు. సోమవారం బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని విధంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేలా కుల గణన సర్వేను చేపట్టారని వెల్లడించారు. పేద వర్గాల కోసం బడ్జెట్లో రూ. 9వేల కోట్లను కేటాయించారని తెలిపారు . నరేంద్ర మోదీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని , 15 లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికి తీసి పేదలకు పంచుతామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు.
ముఖ్యంగా కార్పొరేట్ శక్తులకు దేశాన్ని దోచిపెట్టడంతో పరిశ్రమలు రాకుండా చేశారని విమర్శించారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఓటువేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సొసైటీ అధ్యక్షుడు ఎర్రబాల కృష్ణారెడ్డి, డాక్టర్ అంజిరెడ్డి, ఎజాస్, ఖాలిక్, నార్ల రవీందర్, నందకుమార్, గౌస్, అజీమ్, పిట్ట శ్రీధర్, దాసరి శీను, మోతిలాల్ , తదితరులు ఉన్నారు