వినాయక్ నగర్, సెప్టెంబర్ : 16 నిజామాబాద్ మండల పరిధిలోని ఓ గ్రామంలో నిర్వహిస్తున్న కళ్లు డిపోలో మత్తు పదార్థం ఉన్నట్లుగా సమాచారం అందడంతో నార్కోటిక్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు. నార్కోటిక్ సిఐ ఆధ్వర్యంలో రూరల్ పోలీసు టీం కలిసి నిజామాబాద్ మండల పరిధిలోని గుండారం కళ్లు డిపో పై మంగళవారం ఉదయం దాడి చేశారు. కల్లు డిపోలో తనిఖీలు చేయగా కృత్రిమ కల్లు తయారు చేసేందుకు వినియోగించే మత్తు పదార్థం (ఆల్ ఫ్రాక్ జోలం) ఉన్నట్లు దాడిలో గుర్తించారు.
దాడిలో రూ.3.60 లక్షల విలువచేసే ,600 గ్రాములు అల్ఫ్రా జోలం సీజ్ చేశారు. కల్లు డిపో రమేష్ గౌడ్ తో పాటు అందులో పని చేసే అశోక్ ను నార్కోటిక్ టీం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీజ్ చేసిన మత్తుపదార్థంతో పాటు డిపో నిర్వాహకులైన ఇద్దరిని నిజామాబాద్ రూరల్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.