భీమ్గల్, అక్టోబర్ 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు సుందరంగా తయారయ్యాయి. కానీ కొన్ని గ్రామ పంచాయతీల్లో తీరు మారడం లేదు. గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ షెడ్లకు తరలించడంలో సిబ్బంది అలసత్వం వహిస్తున్నారు. అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. డంపింగ్ షెడ్లకు చేరాల్సిన చెత్త రోడ్లపై పోస్తూ చేతులు దులుపుకొంటున్నారు. ఇండ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేయాల్సి ఉంది. సేకరించిన చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారు చేసి గ్రామ పంచాయతీలు ఆదాయం పొందాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. గ్రామ పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ ప్రణాళికలు ఆచరణలో అమలుకావడం లేదు.
గ్రామంలో సేకరించిన చెత్తను కచ్చితంగా డంపింగ్ షెడ్లకు తరలించాలని ఇదివరకే కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశాం. కొన్ని గ్రామాల్లో వాటి అమలు తీరు ఆశించిన స్థాయిలో లేదు. వర్మీకంపోస్ట్ తయారు చేసి విక్రయించి ఆదాయం పొందాలని సూచించాం. కచ్చితంగా తడి, పొడి చెత్తను వేరు చేయాలి. చెత్తను డంపింగ్ షెడ్డుకు తరలించాలి.
– లక్మ రాజేశ్వర్, ఎంపీడీవో, భీమ్గల్