లింగంపేట, జనవరి27: మండల కేంద్రంలోని పురాతన నాగన్న బావి షూటింగ్‌లకు స్పాట్‌గా మారింది. శతాబ్దాల కాలం నాటి నాగన్న బావి శిథిలావస్థకు చేరింది. నిర్లక్ష్యానికి గురై శిథిల దశకు చేరిన నాగన్న బావి స్థితి గతులపై గతంలో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై అప్పటి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ స్పందించారు. నాగన్న బావి అభివృద్ధిపై దృష్టి సారించారు.
కలెక్టర్ ప్రత్యేక నిధులు కేటాయించడంతోపాటు ఇన్ఫోసిస్ సంస్థ, రెయిన్ వాటర్ ప్రాజె క్టు వారి సహకారంతో అభివృద్ధి చేశారు. అప్పటి ఎమ్మెల్యే జాజాల సురేందర్, ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు ప్రత్యేక నిధులు కేటాయించి పూర్థి స్థాయిలో అభివృద్ధి చేశారు. సోమవారం నాగన్న బావి వద్ద కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాలతోపాటు పిట్లం, గాంధారి, డిచ్పల్లి తదితర గ్రామాలకు చెందిన కొందరు ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. షూటింగ్ నేపథ్యంలో నాగన్న బావి పరిసరాలు సందడిగా మారాయి.