రుద్రూర్, జూన్ 28: కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ అన్నారు. కామారెడ్డి జిల్లా వర్ని మండలం జాకోరాగ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఎందుగుల దత్తు ఇటీవల మరణించాడు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున మంజూరైన రూ.రెండు లక్షల ప్రమాద బీమా చెక్కును ఆయన బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్‌తో కలిసి శనివారం అందజేశారు.
పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాల సంక్షేమం కోసం పార్టీ తరఫున బీమా చేయిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వర్ని మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎజాజ్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గైని లక్ష్మణ్, నాయకులు హఫీజ్ బేగ్, గెరిగంటి లక్ష్మీనారాయణ, ఆసిఫ్, జీషన్, ఫయీమ్, ఆనంద్‌గౌడ్, ప్రవీణ్ యాదవ్, ఉస్మాన్, మధు, మహేందర్, సాయితేజ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.