MRPS formation day | బోధన్ : బోధన్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణం బాబు జగ్జీవన్ రాం విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు, ఉమ్మడి రాష్ట్ర దళిత రత్న అవార్డు గ్రహీత మందుగల విద్యాసాగర్ మాట్లాడారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరావు, పట్టణ నాయకులు ఈరపురం పోశెట్టి, పెద్దింటి సురేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి కాళ్ల మహేందర్, ఉపకులాల రాష్ట్ర కార్యదర్శి (జేఏసీ) శంకర్, సీనియర్ నాయకులు బండారి యాదగిరి, కొత్తపల్లి రవీందర్, బక్కయ్య, మండల అధ్యక్ష, కార్యదర్శులు సాయిలు, మహేష్, మైనార్టీ రాష్ట్ర నాయకుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.