ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ( MLA Sudarsan reddy ) పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ( MP Aravind ) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మను ( Effigy ) అంబేద్కర్ చౌరస్తా వద్ద దహనం చేశారు.
మున్సిపల్ మాజీ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ మోత్కూరి లింబా గౌడ్ మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. కేంద్రం మంజూరు చేసిన నవోదయను సుదర్శన్ రెడ్డి అడ్డుకున్నారని అరవింద్ చేసిన ఆరోపణల్లో వాస్తవాలు నిజం లేదని అన్నారు. బోధన్ ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.