Sirikonda | వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.. సిరికొండ ఎస్సై రామకృష్ణ
ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొంది సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సిరికొండ ఎస్సై రామకృష్ణ పిలుపునిచ్చారు.
Sirikonda | సిరికొండ, జూన్ 12 : ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొంది సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సిరికొండ ఎస్సై రామకృష్ణ పిలుపునిచ్చారు. సిరికొండ మండలంలోని చిమన్ పల్లి గ్రామంలో శుక్రవారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలపై సురక్షితంగా ప్రయాణించేందుకు ప్రతి వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
చాలామంది వాహనదారులు హెల్మెట్ ధరించలేక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై చివరి నిమిషంలో చికిత్స అందగా మృతి చెందారని పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, ఇచ్చినచో వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అపరిచిత వ్యక్తులకు ఎవరికి ఓటీపీలు చెప్పదని, ఖాతాల్లో డబ్బులు ఖాళీ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కళ్లెం నర్సయ్య, ఉప సర్పంచ్ ఏనుగు రాజేందర్, కార్యదర్శి అన్వేష్, సురని రాజు, మిల్క్ మహేష్, అల్మాల నరేష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

