లింగంపేట్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి (Tadwai) మండల కేంద్రానికి చెందిన చెవిటి రేవతి, ఇద్దరు పిల్లలు రిత్విక్, రియాన్సు అదృశ్యమైనట్లు (Missing) తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు (SI Venkateshwar) తెలిపారు. రేవతి తన భర్త రంజిత్ తో కుటుంబ విషయంలో పలుమార్లు గొడవలు పడ్డట్లు తెలిపారు. ఈనెల 20న రంజిత్ గొర్రెలు మేపడానికి వెళ్లి సాయంత్రం రాగా భార్య ,పిల్లలు కనిపించకపోవడంతో బంధువుల వద్ద, ఇంటి పరిసరాల్లో గాలించారు. వారి ఆచూకి లభ్యం కాకపోవడంతో భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రేవతి, పిల్లల ఆచూకి తెలిసిన వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.