బోధన్ : బోధన్ పట్టణం శక్కర్ నగర్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha ) జన్మదిన వేడుకలు అర్ధరాత్రి వేళ జీరో అవర్లో వినూత్నంగా జరిగాయి. బీఆర్ఎస్ మైనారిటీ సెల్ రాష్ట్ర నాయకుడు ఎంఏ రజాక్( MA Rajak) ఆధ్వర్యంలో మహిళలు బర్త్ డే ( Birthday )కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రజాక్ ఆధ్వర్యంలో ఒక్కో ఏడాది ఒక్కో రకంగా కవిత జన్మదిన వేడుకలు జీరో అవర్లో వినూత్నంగా నిర్వహిస్తుండటం గమనార్హం. కాగా గురువారం నిజామాబాద్( Nizamabad) , కామారెడ్డి ( Kamareddy) జిల్లాలో కవిత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్, జాగృతి, విభాగ సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు. పాఠశాలలో విద్యార్థులకు పండ్లు, ప్లేట్లను పంచి పెట్టారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యురాలిగా, ఎమ్మెల్సీగా తెలంగాణకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. జాగృతి ద్వారా బతుకమ్మ వేడుకలను విశ్వవ్యాప్తంగా చాటిచెప్పిన ఘనత కల్వకుంట్ల కవితకే దక్కుతుందని పేర్కొన్నారు.