ఎడపల్లి.. పూల సింగిడి
ఎడపల్లి మండల కేంద్రం గురువారం సద్దుల బతుకమ్మ సంబురాలతో పూలజాతరను తలపించింది. బతుకమ్మ సంబురాలకు భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
- సద్దుల బతుకమ్మ సంబురాల్లో ముఖ్యఅతిథిగా ఆడిపాడిన ఎమ్మెల్సీ కవిత
- పాల్గొన్న ఎమ్మెల్యే షకీల్, ఆయన సతీమణి ఆయేషా ఫాతిమా, జడ్పీ వైస్ చైర్మన్ రజితాయాదవ్
- జనజాతరను తలపించిన బతుకమ్మ సంబురాలు
బోధన్ / ఎడపల్లి, అక్టోబర్ 26: ఎడపల్లి మండల కేంద్రం గురువారం సద్దుల బతుకమ్మ సంబురాలతో పూలజాతరను తలపించింది. బతుకమ్మ సంబురాలకు భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆమె పలు ఇండ్లలో బతుకమ్మలను పేర్చి, అక్కడే బతుకమ్మ ఆడారు. మంగళ్పాడ్ చౌరస్తాలో, బతుకమ్మ చెరువు వద్ద వేలాది మంది మహిళలతో ఆమె ఎంతో ఉత్సాహంగా ఆడిపాడారు.

బతుకమ్మ సంబురాల్లో బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, ఆయన సతీమణి ఆయేషా ఫాతిమా, జడ్పీ వైస్ చైర్మన్ రజితాయాదవ్ పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఆయేషా ఫాతిమా బతుకమ్మ ఆడడం పలువురిని విశేషంగా ఆకట్టుకున్నది. సాయంత్రం దేశ్ముఖ్ గడి నుంచి ప్రారంభమైన బతుకమ్మల శోభాయాత్ర జనజాతరను తలపించింది. బతుకమ్మ సంస్కృతి, సంప్రదాయాన్ని కలకాలం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.


Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

