నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ మండల రైతు సమన్వయ అధ్యక్షుడు బొల్లెంక గంగారెడ్డి మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. గoగారెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, గంగారెడ్డి హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్చా పొందుతూ గురువారం ఉదయం మరణించారు.