బోధన్ రూరల్, మార్చి 13: భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బోధన్ (Bodhan) మండలంలోని ఏ రాజ్ పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు గిర్దార్ గంగారెడ్డి, బోధన్ మాజీ జెడ్పీటీసీ గిర్దార్ లక్ష్మి, పార్టీ మండల అధ్యక్షుడు ధర్మయ్యగారి సంజీవ్ కుమార్, పార్టీ యూత్ నియోజకవర్గ కన్వీనర్ భవానిపేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ.. కవితక్క మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆమె ఎమ్మెల్సీగా, ఎంపీగా బాధ్యతలు చేపట్టి నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గణేష్ పటేల్, వినోద్, రామయ్య, గోపాల్,దాస్ గౌడ్, కమలాకర్, మోతిరామ్, దండు పిరయ్య, అనిల్ పటేల్, సంజు పటేల్, తదితరులు ఉన్నారు.
చందూర్ మండల కేంద్రంలో..
చందూరు మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పటాకులు కాల్చి, కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కవిత నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చందూరు మండల మాజీ సొసైటీ చైర్మన్ మాధవరెడ్డి, పార్టీ నాయకులు మాముల శ్రీను, శివన్నారాయణ, డాన్స్ శేఖర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.