లింగంపేట్ : లింగంపేట్ (Lingampet) మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర నారా గౌడ్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం (MLC election campaign) నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ( Narendhar Reddy) భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టపద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు, లింగంపేట్ టౌన్ అధ్యక్షులు ప్రసాద్ గౌడ్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నగేష్, మండల యూత్ అధ్యక్షులు రాజు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు వంజరి ఎల్లమయ్య, కౌడరవి, ఖాసీం, రఫీయుద్దీన్, శివలాల్ తదితరులు పాల్గొన్నారు.