మోర్తాడ్, నవంబర్ 17: బాధిత కుటుంబానికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అండగా నిలిచారు. కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సౌందర్య కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నది.
నిమ్స్‌లో గుండె ఆపరేషన్ చేయాల్సి ఉండడంతో విషయాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులు..మాజీ మంత్రి వేముల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వేముల రూ.2.50 లక్షల ఎల్వోసీని మంజూరు చేయించారు. ఎల్వోసీ కాపీని హైదరాబాద్‌లో బాధిత కుటుంబీకులకు ఆదివారం అందజేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మేలు మరచిపోమని, ఆయనకు జీవితకాలం రుణపడి ఉంటామని సౌందర్య కుటుంబీకులు పేర్కొన్నారు.