నాణ్యమైన విద్యుత్‌ను అందిచాలి
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని మాజీ మంత్రి, బా ల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు.
- ఎస్ఈకి మాజీ మంత్రి వేముల సూచన
వేల్పూర్, జూన్ 2: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని మాజీ మంత్రి, బా ల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. మండలంలోని వాడీ గ్రామంలో విద్యుత్ సమస్యతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పరిష్కరించాలని కోరుతూ రైతులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన వేముల విద్యుత్ సరఫరా పెంపునకు చర్యలు తీసుకోవాలని ఎస్ఈకి సూచించారు.
బాల్కొండ నియోజకవర్గ రైతులకు సాగు సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని కోరారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంగళవారం వాడీ గ్రామంలో తనను కలిసిన రైతులు వ్యవసాయానికి కేటాయిస్తున్న విద్యుత్ సరఫరా సమయాన్ని పెంచాలని విజ్ఞప్తి చేయగా, వెంటనే జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈతో వేముల ఫోన్లో మాట్లాడారు.
గతంలో రైతులకు రోజుకు 17 నుంచి 18 గంటల వరకు విద్యు త్ సరఫరా అందించారని, ప్రస్తుతం అది కేవలం 11 గంటలకు పరిమితం కావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం పంటల సాగు ప్రారంభమవుతున్న కీలక సమయం లో పసుపుతో పాటు ఇతర ప్రధాన పంటల విత్తనాలు వేస్తున్నారని, ఈ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే సాగు పనులు దెబ్బ తిని రైతాంగం నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు.
నియోజకవర్గంలోని అన్ని సబ్స్టేషన్ల పరిధిలో రైతులకు అవసరమైన మేరకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరాను పెంచి వారు సకాలంలో పంటలు వేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి స్పందించిన జిల్లా విద్యుత్ శాఖ ఎ స్ఈ వ్యవసాయ విద్యుత్ సరఫరా సమయాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

