మోర్తాడ్, ఆగస్టు 18: గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకునే రుణమాఫీ కాలేని రైతులకు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ అండగా నిలవాలని, వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
దరఖాస్తు చేసుకునే రైతులకు ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే స్థానికంగా ఉండే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను సంప్రదించాలని రైతులకు సూచించారు. రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ అయ్యేవరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని ఆయన పునరుద్ఘాటించారు.