బాన్సువాడ ( జుక్కల్), ఆగస్టు 5: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్‌రావు వ్యవహార శైలి ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సమస్యలు దృష్టికి తీసుకొచ్చేందు కు యత్నించిన యువకులపై రుసురుసలాడడం వివాదాస్పదంగా మారింది. ఏం త మాషాలు చేస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. హామీలు ఎప్పడు అమ లు చేస్తారని ప్రశ్నించినందుకు సమాధానం చెప్పకుండా సమస్యలేమైనా ఉంటే క్యాంప్ ఆఫీస్‌కు వచ్చి మాట్లాడాలని దురుసుగా సమాధానం చెప్పడంపై యువకులు ఆగ్ర హం వ్యక్తం చేశారు.
స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంత్‌రావు, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్‌తో కలిసి సోమవారం జుక్కల్ మండల కేంద్రానికి వచ్చా రు. అధికారిక కార్యక్రమానికి వచ్చిన ఎ మ్మెల్యేకు ఊహించని విధంగా పరాభవం ఎదురైంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దారుణంగా ఉందని, కనీసం నడవలేని పరిస్థితి ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతున్నా చిన్న సమస్య కూడా పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలు సమస్యలను దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా లక్ష్మీకాంత్‌రావు సహనం కోల్పోయారు.
తమాషాలు చేస్తున్నారా? అంటూ బెదిరించారు. రోడ్లు బాగా లేవని తాము అడిగితే, తమాషాలా అంటూ ఎవరిని అంటున్నారని యువకులు నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని స్థానిక యువకులు లక్ష్మీకాంతరావు కారుకు అడ్డంగా నిలుచున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే క్యాంప్ కార్యాలయానికి వచ్చి మాట్లాడాలని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో యువకులు గట్టిగా నిలదీయడంతో లక్ష్మీకాంత్‌రావు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. త మ ఇబ్బందులు చెప్పుకునేందుకు యత్నిస్తే ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.