పోతంగల్: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు,బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas reddy) జన్మదిన వేడుకలు (Birthday ) కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హన్మంతు, మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, ఉమ్మడి మండలాల యూత్ అధ్యక్షుడు చాంద్ పాషా, మాధవ రావు పటేల్, అభిషేక్,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.