ఆర్మూర్, జూన్24: ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ప్రజలు తనను ఆదరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు.‘నమస్తే నవనథపురం’ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని 18వ వార్డులో పర్యటించారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వార్డులో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని పలువురు దివ్యాంగులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ వస్తే ఏమొస్తది అని అవహేళన చేసిన వారికి ఆర్మూర్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే సమాధనమన్నారు. బీఆర్ఎస్ అంటేనే బడుగులు, రైతుల సంక్షేమం అని అభివర్ణించారు. కేసీఆర్ సకల జనుల ఆత్మబంధువు అని ఎమ్మెల్యే అన్నారు. దివ్యాంగులకు రూ.4016 చొప్పున పింఛన్లు ఇస్తున్న బీఆర్ఎస్ సర్కారు కాపాడుకునే బాధ్యత తమదేనని దివ్యాంగులు తెలిపారు. 18వ వార్డు సమీపంలోనే వంద పడక దవాఖానను సాధించామని ఇప్పటి వరకు 25వేల ఉచిత ప్రసవాలు చేవారన, ఒక్కో తల్లికి రూ.50వేల ఖర్చు తప్పిందన్నారు. ఎంపీ అర్వింద్ కేంద్ర ప్రభుత్వం నుంచి నయా పైసా మంజూరు చేయించలేదని, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిలో అర్వింద్ వాటా ఎంత అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆర్మూర్ అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. పెండింగ్ పనులన్నీ త్వరలో పూర్తి చేసేలా అధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. ప్రజల కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ ఆదరించాలని కోరారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు భూమిపూజలు, శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినితా పవన్, వైస్ చైర్మన్ మున్న, కౌన్సిలర్ వనం శేఖర్, న్యాయవాది శ్రీనివాస్‌రావు, నాయకులు పండిత్ పవన్, సంజయ్సింగ్బబ్లూ, రవిగౌడ్, యూసుఫ్, కమిషనర్ ప్రసాద్చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.