వినాయక్‌నగర్, ఆగస్టు 10: మున్సిపల్ కార్పొరేషన్లో దోచుకున్న ప్రతి పైసా నగర అభివృద్ధికి ఉపయోగించాలని, ఏసీబీ అధికారులు రికవరీ చేసిన డబ్బు తిరిగి మున్సిపల్ ఖాతాలో జమచేసి అభివృద్ధికి ఖర్చు చేయాలని అర్బన్ ఎమ్మెల్మే ధన్పాల్ సూర్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇందూరు మున్సిపాలిటీ అవినీతికి కేరాఫ్ అడ్డాగా మారిందని,
తాను గెలిచిన నాటినుంచి ఇదే విషయమై పలుమార్లు హెచ్చరించినట్లు తెలిపారు. శుక్రవారం ఓ అధికారి ఇంట్లో జరిగిన ఏసీబీ దాడుల్లో రూ.6 కోట్ల వరకు అక్రమ సంపాదన దొరకడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మున్సిపల్లోని వివిధ శాఖల్లో అవినీతి తిమింగిలాలు ఇంకా ఉన్నాయని, అవినీతి ప్రక్షాళన మరింత జరగాల్సిన అవసరం ఉన్నదని ప్రకటనలో తెలిపారు.