అత్యంత సుందరంగా కురుమూర్తి ఆలయం
పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆల య రాజగోపుర నిర్మాణం సీఎం కేసీఆర్ హయాంలో నెరవేరిందన్నారు.
- రూ.1.20 కోట్లతో రాజగోపురం ఏర్పాటు
- అన్ని వర్గాల వారికి సీఎం కేసీఆర్ అండ
- చెక్‌డ్యాంల నిర్మాణంతో కళకళలాడుతున్న పంటపొలాలు
- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
- కాంచనగుహలో ప్రత్యేక పూజలు, రాజగోపురం ప్రారంభం
దేవరకద్ర రూరల్ (చిన్నచింతకుంట), మార్చి 27 : పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆల య రాజగోపుర నిర్మాణం సీఎం కేసీఆర్ హయాంలో నెరవేరిందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో వెలిసిన కురుమూర్తి ఆలయ ప్రాంగణంలో రూ. 1.20 కోట్లతో నిర్మించిన రాజగోపురాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం కలశ ప్రతిష్ఠాపన, హోమానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అలాగే నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లోని వివిధ గ్రామాలకు చెంది న 92మంది లబ్ధిదారులకు రూ. 92,10,672 విలువ గల కల్యాణలక్ష్మి, 129 మందికి రూ.54.66 లక్షల విలువ గల సీఎం సహాయనిధి చెక్కులు, చిన్నచింతకుంట మండలంలో షాదీఖానా ని ర్మాణానికి రూ.20 లక్షల ప్రొసీడింగ్‌ను పంపిణీ చేశారు. కౌకుంట్ల మండలకేంద్రానికి చెందిన సంతోష మృతి చెంద గా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును బాధిత కు టుంబసభ్యులకు అందజేశారు.
ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతం లో ఈ ప్రాంతాన్ని పాలించిన నాయకు లు చేసిందేమీ లేదన్నారు. ప్రాణాలకు తె గించి పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం లో సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు పార్టీలకతీతంగా 12 వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశామన్నారు. 21 చెక్‌డ్యాంలు నిర్మించగా.. మ రో 9 ఆనకట్టల పనులు పురోగతి దశలో ఉన్నాయన్నారు. ఆనకట్టల నిర్మాణంతో పంటపొలాలు కళకళలాడుతున్నాయన్నారు. అనంతరం చిన్న వడ్డెమాన్ గ్రా మంలో మల్లన్న స్వామి, రేణుక ఎల్లమ్మ, వీరనాగమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమం లో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వ రి, ఆలయ పాలక మండలి చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, వనపర్తి జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాము, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

